Harish Kumar Gupta: ఏపీ కొత్త డీజీపీ గా హరీశ్ కుమార్ గుప్తా నియామకం

Harish Kumar Gupta appointed as new DGP of Andhra Pradesh
  • నిన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ
  • నూతన డీజీపీ పోస్టు కోసం ముగ్గురి పేర్లు సిఫారసు చేసిన ప్రభుత్వం
  • హరీశ్ కుమార్ గుప్తాను ఎంపిక చేసిన ఎన్నికల సంఘం
  • హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
  • ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న గుప్తా
నిన్నటివరకు డీజీపీగా వ్యవహరించిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది. 

కాగా, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన నేపథ్యంలో, ముగ్గురు సీనియర్ ఐజీల జాబితా పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో, ఏపీ ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను సిఫారసు చేసింది. అయితే, ఎన్నికల సంఘం ఈ జాబితా నుంచి హరీశ్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. 

హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. తాజా నియామకం నేపథ్యంలో, తక్షణమే డీజీపీగా విధుల్లో చేరాలని హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ ఆదేశించింది.
Harish Kumar Gupta
DGP
Andhra Pradesh
EC

More Telugu News