Anushka Sharma: కొడుకు పుట్టిన తర్వాత తొలిసారి స్టేడియంలో సందడి చేసిన అనుష్క శర్మ

Anushka Makes First Public Appearance After Son Akaay Kohli Birth
  • ఇటీవల అకాయ్ కోహ్లీకి జన్మనిచ్చిన విరాట్ కోహ్లీ దంపతులు
  • బెంగళూరు-గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్‌ను స్టేడియంలో కూర్చుని వీక్షించిన అనుష్క
  • ప్రస్తుతం ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో నటిస్తున్న అనుష్క
టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కుమారుడు అకాయ్ కోహ్లీ జన్మించిన తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించారు. గత రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌ను అనుష్క స్టేడియంలో కూర్చుని వీక్షించారు.

అనుష్క నవ్వుతూ జట్టుకు మద్దతుగా చేతులు ఊపుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె రాకతో స్టేడియంలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల పుట్టిన రోజు జరుపుకొన్న అనుష్క ఫొటోలు కూడా సోషల్ మీడియాకెక్కాయి. ఆర్సీబీ జట్టు సభ్యులతో కలిసి అనుష్క తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు.  2021 కోహ్లీ-అనుష్క దంపతులు వామికకు జన్మనివ్వగా మూడేళ్ల తర్వాత కుమారుడు అకాయ్ కోహ్లీకి జన్మనిచ్చారు. టీమిండియా మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ మూవీలో అనుష్క ప్రస్తుతం నటిస్తున్నారు.
Anushka Sharma
Virat Kohli
Team India
Bollywood
Akaay Kohli
Chakda Xpress

More Telugu News