Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లోని పబ్ లో అసభ్య నృత్యాలు.. నిర్వాహకులపై కేసు

Police Raid On After Nine Club In BanjaraHills
Advertisement
  • 167 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
  • ఇతర రాష్ట్రాల నుంచి యువతులను పిలిపించి డ్యాన్స్
Advertisement
ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్ లో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని ఆఫ్టర్ నైన్ పబ్ లో శనివారం రాత్రి పోలీసులు రెయిడ్ చేశారు. అసభ్య నృత్యాలు చేస్తున్న యువతులతో పాటు పబ్ కు వచ్చిన యువతీయువకులను స్టేషన్ కు తరలించారు. పబ్ ను క్లోజ్ చేయించారు. సిటీలో పబ్ కల్చర్ నానాటికీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా వీకెండ్స్ లో పబ్ ల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. డ్రింక్స్, మ్యూజిక్ తో హోరెత్తిస్తున్నారు. సిటీలో నడుస్తున్న వాటిలో అన్ని అనుమతులు పొందిన పబ్ లు కొన్నే.. మిగతావి ఎలాంటి అనుమతుల్లేకున్నా, నిబంధనలను ఖాతరు చేయకుండా నడుస్తున్నాయి.

ఈ క్రమంలోనే పోలీసులు, ఉన్నతాధికారులు తరచుగా పబ్ లపై దాడులు చేస్తూ నిర్వాహకులపై కేసులు పెడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లోని ఆఫ్టర్ నైన్ క్లబ్ లో శనివారం రాత్రి పోలీసులు రెయిడ్ చేశారు. పబ్ లో యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తుండడంతో నిర్వాహకులతో పాటు పబ్ కు వచ్చిన వారిని కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. 35 మంది యువతులతో పాటు మొత్తం 167 మందిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Advertisement
Advertisement
Pub
Club
Hyderabad Pub
Banjara Hills
vulgar dance

More Telugu News