Chhattisgarh: మొబైల్ వాడొద్దన్న సొంత అన్నను కడతేర్చిన 14 ఏళ్ల బాలిక

Chhattisgarh girl kills brother after he stops her from using mobile phone
  • ఛత్తీస్‌గఢ్‌లో ఘటన
  • ఇంట్లో ఎవరూ లేని సమయంలో అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ
  • ఫోన్లో ఇతర కుర్రాళ్లతో మాట్లాడొద్దంటూ చెల్లెలికి అన్న మందలింపు
  • కోపంతో ఊగిపోయిన బాలిక.. నిద్రిస్తున్న అన్నపై గొడ్డలితో వేటువేసి హత్య
  • పోలీసుల దర్యాప్తులొ  నేరాన్ని అంగీకరించిన వైనం
ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నపై కోపం పెంచుకున్న ఓ 14 ఏళ్ల బాలిక అతడు నిద్రలో ఉండగా గొడ్డలితో నరికి చంపేసింది. కేసీజీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇతర కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ మొదలైంది. నిత్యం మొబైల్ ఫోన్లో ఇతర కుర్రాళ్లతో మాట్లాడుతున్న చెల్లెల్ని అన్న మందలించాడు. సెల్‌ఫోన్ వినియోగం తగ్గించాలని కోపడ్డాడు. 

దీంతో, బాలిక తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అతడు పడుకున్న సమయంలో గొడ్డలితో గొంతు నరికి చంపేసింది. ఆ తరువాత రక్తం మరకలు తొలగించుకునేందుకు స్నానం చేసి వచ్చిన ఆమె ఆ తరువాత ఇరుగుపొరుగుకు తన అన్నను ఎవరో హత్య చేశారని చెప్పింది. అయితే, పోలీసుల విచారణ సందర్భంగా బాలిక చివరకు చేసిన నేరాన్ని అంగీకరించింది.
Chhattisgarh
Girl kills brother
mobile phone
Crime News

More Telugu News