ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
- ఎవరి హయాంలో ఎన్ని నిధులు వచ్చాయో తెలుసుకోవడానికి చర్చకు ఆహ్వానిస్తూ లేఖ
- 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో ఎన్ని నిధులు వచ్చాయి?
- 2014 నుంచి 2024 వరకు ఎన్డీయే హయాంలో ఎన్ని నిధులు వచ్చాయి?
- చర్చిద్దాం రావాలంటూ ఆహ్వానం
పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు ఎంత ఇచ్చారు? పదేళ్ల ఎన్డీయే హయాంలో ఎంత ఇచ్చారు? తేల్చుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? 2014 నుంచి 2024 వరకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎన్ని? చర్చకు ఆహ్వానిస్తూ ఆయన లేఖ రాశారు.