'మహిళపై చేయి చేసుకున్న జీవన్ రెడ్డి' వీడియోపై స్పందించిన కేటీఆర్
- నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఘటన
- సౌత్ ఫస్ట్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కేటీఆర్
- కాంగ్రెస్ దురహంకారమని కేటీఆర్ ఆగ్రహం
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. సౌత్ ఫస్ట్ చేసిన ట్వీట్‌ను బీఆర్ఎస్ నేత రీట్వీట్ చేశారు. 'నిజామాబాద్ నుంచి ఓ వీడియో వెలుగుచూసింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓ వృద్ధురాలి చెంపపై కొట్టాడు. కొన్నిరోజులుగా పెన్షన్ రాకపోవడంతో ఓ మహిళ తన వద్దకు వచ్చి కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. అయితే ఆమె అతనిని గుర్తించలేదు. తనను వినయ్ రెడ్డి అని పిలవడంతో జీవన్ రెడ్డి ఆమెను కొట్టాడు' అని ఈ ట్వీట్ పేర్కొంది.
అయితే ఈ వీడియోపై జీవన్ రెడ్డి స్పందిస్తూ, తాను ఆప్యాయంగానే ఆ మహిళను కొట్టానని వివరణ ఇచ్చుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఈ ఘటన జరిగింది.