KTR: 'మహిళపై చేయి చేసుకున్న జీవన్ రెడ్డి' వీడియోపై స్పందించిన కేటీఆర్

  • నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఘటన
  • సౌత్ ఫస్ట్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కేటీఆర్
  • కాంగ్రెస్ దురహంకారమని కేటీఆర్ ఆగ్రహం
KTR responds on Jeevan Reddy slapping a woman

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఓమహిళపై చేయి చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఉపాధి కూలీ మహిళ బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తానని చెప్పడంతో జీవన్ రెడ్డి ఆమె చెంపపై కొట్టారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. మహిళ చెంపపై కొట్టడం దుర్మార్గపు చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ దురహంకారమని విమర్శించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. సౌత్ ఫస్ట్ చేసిన ట్వీట్‌ను బీఆర్ఎస్ నేత రీట్వీట్ చేశారు. 'నిజామాబాద్ నుంచి ఓ వీడియో వెలుగుచూసింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓ వృద్ధురాలి చెంపపై కొట్టాడు. కొన్నిరోజులుగా పెన్షన్ రాకపోవడంతో ఓ మహిళ తన వద్దకు వచ్చి కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. అయితే ఆమె అతనిని గుర్తించలేదు. తనను వినయ్ రెడ్డి అని పిలవడంతో జీవన్ రెడ్డి ఆమెను కొట్టాడు' అని ఈ ట్వీట్ పేర్కొంది.

అయితే ఈ వీడియోపై జీవన్ రెడ్డి స్పందిస్తూ, తాను ఆప్యాయంగానే ఆ మహిళను కొట్టానని వివరణ ఇచ్చుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News