అమ్మ అమెరికా ఎందుకు వెళ్లిందంటే..?: వైఎస్ షర్మిల
- జగన్ కు, నాకు మధ్య సమదూరం పాటిస్తోందని వెల్లడి
- వైఎస్ విజయమ్మ న్యూట్రల్ గా ఉందన్న షర్మిల
- ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, జగన్ ఫెయిల్
ప్రత్యేక హోదా విషయం మరిచారు..
ఆంధ్రప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తో కానీ ఎలాంటి ఉపయోగం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వాళ్లిద్దరూ ఘోరంగా ఫెయిలయ్యారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాటమార్చారని, ప్రత్యేక హోదా హామీతో అధికారం దక్కించుకున్న వైఎస్ జగన్ కూడా ఎన్నికలయ్యాక ప్రత్యేక హోదా విషయం మరిచిపోయారని విమర్శించారు. వీరి వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అత్యవసరమని, ప్రజల కష్టాలను తొలగించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా చేయాలని రాహుల్ గాంధీ తపనపడుతున్నాడని షర్మిల చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలో పర్యటించినపుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రాధాన్యతా అంశంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని షర్మిల గుర్తుచేశారు.