నెల్లూరులో కూటమి రోడ్ షో... హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
- ఏపీలో మే 13న ఎన్నికలు
- ప్రచార వేగం పెంచిన కూటమి పార్టీలు
- నేడు ఉమ్మడిగా నెల్లూరులో రోడ్ షో, సభ
రోడ్ షోలో కూటమి పెద్దలు చంద్రబాబు, పవన్ పాల్గొనడంతో టీడీపీ, జనసేన శ్రేణులు పోటెత్తాయి. నెల్లూరు నగరం జనసంద్రాన్ని తలపించింది. బాణసంచా మోతలు, పార్టీల గీతాలతో నెల్లూరు రోడ్లు హోరెత్తాయి. పవన్ వీలైనంతవరకు అభిమానులతో చేయి కలుపుతూ ముందుకు సాగగా, చంద్రబాబు అభివాదం చేస్తూ కూటమి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.