Nagarjuna: 'కుబేర' నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ విడుదల

Nagarjuna first look from Kubera out now
షార్ట్స్‌లో చూడండి
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'కుబేర'. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా 'కుబేర' చిత్రం నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇవాళ హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నాగ్ ఫస్ట్ లుక్ టీజర్ ను ఆవిష్కరించారు. 

వర్షంలో నాగార్జున గొడుగు పట్టుకుని వస్తుండగా, ఓ ఐదొందల నోటు వర్షపు నీటిలో తడిసిపోయి కనిపిస్తుంది. ఆ నోటును నాగ్ తీసుకుంటాడని అందరూ భావించినా, తన జేబులోంచి ఓ ఐదొందల నోటు తీసి అక్కడికి కొద్ది దూరంలో ఉంచి నాగ్ వెళ్లిపోతాడు. ఈ ఒక్క సీన్ తోనే నాగార్జున క్యారెక్టర్ పైనా, సినిమా పైనా ఆసక్తిని అమాంతం పెంచేశారు. 

ఈ చిత్రంలో ధనుష్ సరసన రష్మిక మందన్న కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోల్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న కుబేర చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Go Back to Shorts
Nagarjuna
First Look
Kubera
Dhanush
Sekhar Kammula
Rashmika Mandanna

More Telugu News