అనంతపురం జిల్లాలో రూ.2 వేల కోట్ల నగదు పట్టివేత... ఆర్బీఐ నగదుగా తేల్చిన పోలీసులు
- పామిడి వద్ద తనిఖీల్లో నాలుగు కంటైనర్లను ఆపిన పోలీసులు
- ఒక్కో కంటైనర్ లో రూ.500 కోట్లు
- రికార్డులు పరిశీలించిన అధికారులు
- ఆ నగదును ఆర్బీఐ కొచ్చి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు గుర్తింపు
పోలీసులు ఈ కంటైనర్లలోని డబ్బుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ నగదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి చెందినదని తేల్చారు. ఈ రూ.2 వేల కోట్ల నగదును ఆర్బీఐ కొచ్చి నుంచి హైదరాబాద్ కు తరలిస్తోందని అధికారులు తెలిపారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండడంతో ఆ కంటైనర్లను అధికారులు పంపించివేశారు.