Indrakaran Reddy: బీఆర్ఎస్‌కు షాక్... రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Former Minister A Indrakaran Reddy resigned from BRS
  • నేడో... రేపో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఇంద్రకరణ్ రెడ్డి
  • రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపించిన మాజీ మంత్రి
  • ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్న ఇంద్రకరణ్ రెడ్డి
బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన నేడో... రేపో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు. తాను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
Indrakaran Reddy
BRS
KCR
Revanth Reddy
Lok Sabha Polls

More Telugu News