Prasanna Kumar Reddy: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు

Case failed on YSRCP MLA Prasanna Kumar Reddy
షార్ట్స్‌లో చూడండి
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కొత్తూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని... ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీడీవో సాయిలహరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Prasanna Kumar Reddy
YSRCP
Vemireddy Prabhakar Reddy
Telugudesam

More Telugu News