Revanth Reddy: సెమీఫైనల్స్‌లో కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాం... ఫైనల్స్‌లో మోదీని ఓడించాలి: రేవంత్ రెడ్డి

Revanth reddy appeal to telangana people
  • తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ గడ్డ ఊపిరులూదిందన్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణ సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారన్న సీఎం
  • పదేళ్లలో తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదన్న ముఖ్యమంత్రి
మొన్న జరిగిన సెమీ పైనల్స్ వంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను చిత్తుగా ఓడించారని, ఫైనల్స్‌లో నరేంద్ర మోదీని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 

జమ్మికుంటలో జరిగిన జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైనదన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఈ గడ్డ ఊపిరులూదిందన్నారు. తెలంగాణ సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్‌కు కరీంనగర్ ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. 

మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అయితే లోక్ సభ ఎన్నికలు ఫైనల్స్ వంటివి అన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్‌ని ఎంపీగా గెలిపిస్తే ఆయన ఏం తెచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్లలో తెలంగాణకు మోదీ ఇచ్చింది ఏమీ లేదన్నారు.
Revanth Reddy
Telangana
Congress
BJP

More Telugu News