తెలివిగా ఓటేయండి.. హ‌ర్ష గోయెంకా ట్వీట్ వైర‌ల్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలివిగా ఓటేయండి.. హ‌ర్ష గోయెంకా ట్వీట్ వైర‌ల్‌!

Harsh Goenka Tweet goes Viral on Social Media
  • నేత‌ల వాగ్దానాల‌పై కాకుండా ప‌నితీరుపై ఆలోచించి తెలివిగా ఓటు వేయాల‌న్న హ‌ర్ష గోయెంకా
  • పాల‌కుల చేతిలో బ‌క‌రా కావొద్ద‌నే అర్థం వ‌చ్చేలా ఓ పెద్ద మేక‌పోతు ఫొటోను ట్వీట్ చేసిన వైనం
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పారిశ్రామిక‌వేత్త పోస్ట్‌
ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్‌ హ‌ర్ష గోయెంకా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. తన అభిప్రాయాలను, ఇతరులకు స్ఫూర్తినిచ్చే ఫొటోలు, వీడియోల‌ను ఆయ‌న‌ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇదే కోవ‌లో ఆయ‌న తాజాగా ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. త‌న ఎక్స్ (ట్విట‌ర్) ఖాతా ద్వారా త‌ర‌చూ ప‌లు అంశాల‌పై ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేసే హ‌ర్ష గోయెంకా తాజాగా ఒక్క ఫొటోతో ఓటు విలువ‌ను చాటి చెప్పారు. 

'ప్ర‌జ‌లారా జాగ్ర‌త్త.. నేత‌ల వాగ్దానాల‌పై కాకుండా ప‌నితీరుపై ఆలోచించండి. తెలివిగా ఓటు వేయండి. మోస‌పోకండి' అంటూ ట్వీట్ చేశారు. దానికి పాల‌కుల చేతిలో మ‌నం బ‌క‌రా కావొద్దు అని అర్థం వ‌చ్చేలా ఓ పెద్ద మేక‌పోతు ఫొటోను జోడించారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. కాగా, కొన్ని రోజుల ముందు కూడా ఇదే మాదిరి ఓటు విలువ‌ను తెలియజేసే.. షారూఖ్ ఖాన్ న‌టించిన లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ 'జవాన్' మూవీలోని డైలాగ్‌తో కూడిన వీడియోను కూడా హ‌ర్ష గోయెంకా ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.
Advertisement
Harsh Goenka
Twitter
Social Media
Vote

More Telugu News