Priyanka Gandhi: ప్రియాంకగాంధీ పోటీ డౌటేనట.. అమేథీ బరిలోకి రాహుల్‌గాంధీ!

Priyanka Gandhi Vadra unlikely to contest upcoming Lok Sabha elections
  • తాను పోటీ చేయడం కంటే ప్రచారం చేయడం ద్వారానే కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతుందని ప్రియాంక భావన
  • వరుస షెడ్యూళ్లతో ప్రియాంక బిజీబిజీ
  • అమేథీ నుంచి రాహుల్‌ను బరిలోకి దింపాలని కోరుతున్న యూపీ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంకగాంధీ రానున్న లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లో తాను ఒక సీటులో బరిలో నిలవడం కంటే పార్టీ కోసం ప్రచారం చేయడం ద్వారానే పార్టీకి ఎక్కువ లాభం చేకూరుతుందని భావిస్తున్న ఆమె పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అమేథీ నుంచి రాహుల్ బరిలోకి దిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రియాంక ప్రస్తుతం ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. రేపు అస్సాం, గురువారం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో ప్రచారం చేస్తారు. ఆపై మే 3న ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో పర్యటిస్తారు. కాగా, అమేథీ, రాయబరేలీ నుంచి రాహుల్, ప్రియాంకలను బరిలోకి దింపాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రస్ పార్టీ అధిష్ఠానాన్ని కోరింది. అయితే, దీనిపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
Priyanka Gandhi
Uttar Pradesh
Congress
Rahul Gandhi
Amethi
Raebareli

More Telugu News