YS Jagan: షర్మిల, రేవంత్‌రెడ్డిని నడిపిస్తున్నది చంద్రబాబే: జగన్

YS Jagan Big Comments On Sharmila And Revanth Reddy
  • వారిద్దరి రిమోట్ చంద్రబాబు వద్ద ఉందన్న జగన్
  • కడపలో షర్మిల పోటీపై తనకు ఎలాంటి బాధా లేదని స్పష్టీకరణ
  • కాకపోతే ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనన్నదే తన బాధ అన్న జగన్
  • అక్రమాస్తుల కేసులో తన తండ్రి పేరును చేర్చిన కాంగ్రెస్‌తో ఆమె కలిసి పనిచేస్తోందంటూ ఆవేదన
  • ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు
తన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరినీ నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని, వారి రిమోట్ ఆయన వద్దే ఉందని ఆరోపించారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కడప లోక్‌సభ స్థానం నుంచి తన సోదరి షర్మిల పోటీ చేస్తుండడంపై తనకు ఎలాంటి బాధా లేదన్న జగన్.. ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని బాధగా ఉందని చెప్పారు. తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో తన తండ్రి వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్‌కు షర్మిల పనిచేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తన పోరాటం చంద్రబాబుతో మాత్రమే కాదని, కాంగ్రెస్, బీజేపీతో కూడానని జగన్ వివరించారు.
YS Jagan
YS Sharmila
Revanth Reddy
Chandrababu

More Telugu News