హైదరాబాద్– విజయవాడ రూట్ లో ప్రతీ పది నిమిషాలకో బస్సు: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- వేసవి రద్దీని తట్టుకోవడానికి బస్సుల సంఖ్య పెంచామన్న సజ్జనార్
- రోజూ 120కి పైగా బస్సులను నడుపుతున్నట్టు వెల్లడి
- ముందస్తు బుకింగ్ లకు 10 శాతం డిస్కౌంట్ కూడా
‘టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ http://tsrtconline.in ను సంప్రదించండి’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం రోజూ 120కి పైగా బస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ బస్సులు –2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ – 2, గరుడ –10, గరుడ ప్లస్– 9, రాజధాని– 41, సూపర్ లగ్జరీ– 62 బస్సులు ఉన్నాయని వివరించారు.