TDP: ప‌లువురు టీడీపీ నేత‌ల‌పై వేటు వేసిన అచ్చెన్నాయుడు

TDP Leaders Suspended by President Atchannaidu
  • పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేత‌ల‌ను స‌స్పెండ్ చేసిన అచ్చెన్నాయుడు
  • సస్పెన్ష‌న్‌కు గురైన వారిలో సివేరి అబ్ర‌హాం, మీసాల గీత‌, ముడియం సూర్య‌చంద్ర‌రావు, ప‌ర‌మ‌ట శ్యాంకుమార్
  • ఈ మేర‌కు సోమ‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు  
పార్టీ వ్య‌తిరేక కార్యాక‌లాపాల‌కు పాల్ప‌డుతున్న ప‌లువురు నేత‌ల‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన‌ట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇలా సస్పెన్ష‌న్‌కు గురైన వారిలో అర‌కు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సివేరి అబ్ర‌హాం, పోల‌వ‌రానికి చెందిన ముడియం సూర్య‌చంద్ర‌రావు, అమ‌లాపురానికి చెందిన ప‌ర‌మ‌ట శ్యాంకుమార్, విజ‌య‌న‌గ‌రానికి చెందిన మీసాల గీత‌, స‌త్య‌వేడుకు చెందిన జ‌డ్డా రాజ‌శేఖ‌ర్‌, ఉండికి చెందిన వేటూకూరి వెంక‌ట‌శివ‌రామ‌రాజు ఉన్నారు. వీరంద‌రినీ పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్టు అచ్చెన్నాయుడు సోమ‌వారం ప్ర‌క‌టించారు.
TDP
Atchannaidu
Suspended
Andhra Pradesh

More Telugu News