తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
- తెలంగాణ సహా నాలుగో దశ పోలింగ్ జరిగే వివిధ రాష్ట్రాల్లోనూ ముగిసిన గడువు
- వివిధ పార్టీల బుజ్జగింపుల తర్వాత నామినేషన్లు వెనక్కి తీసుకున్న పలువురు స్వతంత్రులు
- మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు
ఉపసంహరణ తర్వాత ఆదిలాబాద్ నుంచి 12 మంది బరిలో నిలిచినట్లుగా తెలుస్తోంది. పలు పార్టీల బుజ్జగింపుల తర్వాత పలువురు స్వతంత్రులు నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. తెలంగాణలో మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.