Telangana: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

  • తెలంగాణ సహా నాలుగో దశ పోలింగ్ జరిగే వివిధ రాష్ట్రాల్లోనూ ముగిసిన గడువు
  • వివిధ పార్టీల బుజ్జగింపుల తర్వాత నామినేషన్లు వెనక్కి తీసుకున్న పలువురు స్వతంత్రులు
  • మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనన్నారు. తెలంగాణలోని పదిహేడు లోక్ సభ స్థానాలకు 625 నామినేషన్లు దాఖలు కాగా, 268 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. ఈరోజుతో ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణతో పాటు నాలుగో దశలో పోలింగ్ జరగనున్న వివిధ రాష్ట్రాల్లో గడువు ముగిసింది.

ఉపసంహరణ తర్వాత ఆదిలాబాద్ నుంచి 12 మంది బరిలో నిలిచినట్లుగా తెలుస్తోంది. పలు పార్టీల బుజ్జగింపుల తర్వాత పలువురు స్వతంత్రులు నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. తెలంగాణలో మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

More Telugu News