Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ బంధువు వాహనంలో రూ.1 లక్ష పట్టివేత

Police searches and rs 1 lakh cash seized from bb patil relative
Advertisement
  • బీబీ పాటిల్ సోదరుడి కుమారుడి వాహనంలో నగదు పట్టివేత
  • పూణే నుంచి టెక్మల్ వస్తుండగా వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
  • జహీరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీబీ పాటిల్
Advertisement
జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ బంధువు వాహనంలో పోలీసులు నగదును పట్టుకున్నారు. బీబీ పాటిల్ 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆయన ఇటీవల బీజేపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.

తనిఖీల్లో భాగంగా బీబీ పాటిల్ సోదరుని కుమారుడు అభినవ్ వాహనంలో నగదును గుర్తించారు. పూణే నుంచి టెక్మల్ వస్తుండగా అభినవ్ పాటిల్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఆయన వద్ద ఉన్న రూ.1 లక్షను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement
BB Patil
BJP
Telangana
Lok Sabha Polls

More Telugu News