Sakshi Dhoni: 'బేబీ ఈజ్ ఆన్ ది వే'.. ధోనీ భార్య సాక్షి పోస్ట్ నెట్టింట‌ వైర‌ల్‌!

Sakshi Dhoni Instagram story from Chepauk during CSK vs SRH goes viral
  • నిన్న‌టి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్‌పై చెన్నై బంప‌ర్‌ విక్ట‌రీ
  • మ్యాచ్ స‌మ‌యంలో ధోనీ భార్య సాక్షి త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ 
  • 'ప్లీజ్ ఇవాళ మ్యాచ్‌ను త్వ‌ర‌గా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే' అంటూ ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్న సాక్షి
  • సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్న ఎంఎస్‌డీ ఫ్యాన్స్‌ 
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక‌గా ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ 78 ప‌రుగుల తేడాతో బంప‌ర్ విక్ట‌రీ సాధించింది. గ‌త‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్ చేతిలో ఓట‌మికి ఈసారి సీఎస్‌కే త‌న సొంత మైదానంలో విజ‌యం సాధించి రివేంజ్ తీర్చుకున్న‌ట్ల‌యింది. ఈ క్ర‌మంలో చెన్నై మాజీ సార‌ధి ఎంఎస్ ధోనీ భార్య సాక్షి పెట్టిన పోస్టు ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

"ప్లీజ్ ఇవాళ మ్యాచ్‌ను త్వ‌ర‌గా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే. కాబోయే అత్త‌గా నా రిక్వెస్ట్ ఇదే" అని సాక్షి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. కాగా, సాక్షి సోద‌రుడు తండ్రి కాబోతున్న‌ట్లు తెలిసింది. దీంతో ఎంఎస్‌డీ అభిమానులంతా సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ధోనీ మామ కాబోతున్నాడంటూ విషెస్ తెలియ‌జేస్తున్నారు.  

ఇదిలాఉంటే.. నిన్న‌టి మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌కు దిగి ఎదుర్కొన్న మొద‌టి బంతినే బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఆ స‌మంలో స్టాండ్‌లో ఉన్న సాక్షి ఇచ్చిన రియాక్ష‌న్ కూడా నెట్టింట బాగా వైర‌ల్ అయింది. ఇక ఈ సీజ‌న్‌లో సీఎస్‌కే ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచులు ఆడి 5 విజ‌యాలు సాధించింది. ప్ర‌స్తుతం 10 పాయింట్ల‌తో ఉన్న చెన్నై పాయింట్ల ప‌ట్టిక‌లో మూడోస్థానంలో కొన‌సాగుతోంది.
Sakshi Dhoni
Instagram
MS Dhoni
Chepauk
CSK vs SRH
Cricket
Sports News

More Telugu News