హెలికాప్టర్ లో సీట్లో కూర్చోబోయి కింద పడిపోయిన మమతా బెనర్జీ.. వీడియో ఇదిగో
- ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మమతా బెనర్జీ
- హెలికాప్టర్ సీట్లో కూర్చునే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయిన మమత
- మమతకు గాయాలైనట్టు సమాచారం
అనంతరం అసన్ సోల్ సభలో పాల్గొనేందుకు ఆమె హెలికాప్టర్ ఎక్కారు. అయితే, హెలికాప్టర్ లో సీట్లో కూర్చునే సమయంలో ఆమె బ్యాలెన్స్ కోల్పోయారు. సీట్లో కూర్చోబోయి కిందపడిపోయారు. వెంటనే ఆమె భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు ఈ ఘటనలో ఆమె గాయపడినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గత నెల మార్చి 14న ఆమె తన నివాసంలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆమె తలకు, ముక్కుకు గాయాలయ్యాయి. గాయాలకు వైద్యులు కుట్లు వేశారు.