ఢిల్లీ వీధుల్లో 'స్పైడర్ మ్యాన్' జంట షికారు... అరెస్టు చేసిన పోలీసులు

Spiderman Spiderwoman Went For A Bike Ride
  • ఇన్ స్టా గ్రామ్ రీల్ కోసం బైక్ రైడ్ ను సెల్ఫీ వీడియో తీసిన జంట
  • అరెస్టు చేసి జరిమానాతో వదిలేసిన ద్వారకా ట్రాఫిక్ పోలీసులు
  • ఇండియన్ స్పైడీ పేరుతో వీడియోలు చేస్తున్న ఢిల్లీ కుర్రాడు ఆదిత్య
స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ లా డ్రెస్ లు వేసుకుని ఓ జంట ఢిల్లీ వీధుల్లో బైక్ పై షికార్లు కొట్టింది. వీళ్ల అతి చేష్టల్ని చూసి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నజాఫ్ గఢ్ కు చెందిన ఆదిత్య (20), అతడి స్నేహితురాలు అంజలి (19) ఇద్దరూ కలసి స్పైడర్ మ్యాన్ నజాఫ్ గఢ్ పార్ట్ 5 పేరుతో ఇన్ స్టాగ్రామ్ రీల్ కోసం బైక్ రైడింగ్ చేద్దామనుకున్నారు.

తర్వాత ఇద్దరూ కలిసి స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ లా డ్రెస్సప్ అయ్యారు. బైకూ రెడీగా ఉంది. స్పైడర్ మ్యాన్ దగ్గరకొచ్చిన స్పైడర్ ఉమెన్ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి రైడ్ కి వెళ్దామా అని అడిగింది. అందుకు అతడు ఓ ఎస్ అని చేతులు కలిపి బైక్ పై అతడి వెనుకే కూర్చోబెట్టుకున్నాడు. వారిద్దరూ కలసి ఢిల్లీ నగర వీధుల్లో షికారుకు వెళ్లారు. ఇన్ స్టా గ్రామ్ రీల్ కోసం ఇలా సెల్ఫీ వీడియో తీసుకుంటూ వీధుల్లో షికారు చేసిన క్లిప్ ను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు. 

క్షణాల్లో అది బాగా వైరల్ అయ్యింది. దీన్ని చూసిన వాయవ్య ఢిల్లీలోని ద్వారక ట్రాఫిక్ పోలీసులు వారిని అరెస్టు చేసి మోటారు వాహన చట్టం కింద జరిమానా వేసి వదిలేశారు. వాస్తవానికి ఆదిత్యకు ఇలా సాహస విన్యాసాలతో కూడిన వీడియోలు చేయడం కొత్తేమీ కాదు. ఇండియన్ స్పైడీ పేరుతో ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేసేవాడు. ఇతడి వీడియోలకు సుమారు 10 వేల మంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. కొన్ని కొన్ని వీడియోలకు 70 వేలకు పైగా లైక్స్ వస్తుంటాయి. ఈ ఇండియన్ స్పైడీ బ్యాడ్మింటన్ ఆడుతూ, ట్రాక్టర్ నడుపుతూ, ట్రెండింగ్ సాంగ్స్ కు డాన్స్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు. వీటితో పాటు కాలేజీ వేడుకల్లో జరిగే స్పాట్ ప్రదర్శనలిస్తుంటాడు.

Go Back to Shorts
Spider man
Spider woman
Bike ride
Police arrest
Delhi
Traffic police

More Telugu News