ఇంటర్ ఫలితాల తర్వాత తెలంగాణలో ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య
- మహబూబాబాద్ లో ఇద్దరు అమ్మాయిలు..
- మంచిర్యాల జిల్లాలో ముగ్గురు విద్యార్థులు సూసైడ్
- జడ్చర్లలో రైలు పట్టాలపై ఇంటర్ విద్యార్థి మృతదేహం
మహబూబాబాద్ లో ఇద్దరు విద్యార్థినులు చనిపోయారని, ఇంటర్ ఫెయిలయ్యామనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారని బాధితుల పేరెంట్స్ వెల్లడించారని ఎస్పీ పేర్కొన్నారు. ఈస్ట్ జోన్ పరిధిలో ఓ విద్యార్థి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడని డిప్యూటీ కమిషనర్ వివరించారు. నల్లకుంటకు చెందిన ఇంటర్ స్టూడెంట్ ఒకరు జడ్చర్లలోని రైల్వే ట్రాక్ పక్కన విగతజీవిగా కనిపించాడని పోలీసులు తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో సరిగా మార్కులు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు వివరించారు.