Nara Bhuvaneswari: ఎన్టీఆర్ స్కూల్ విద్యార్థిని భావజ్ఞకు 10వ తరగతిలో స్టేట్ 3వ ర్యాంకు... నారా భువనేశ్వరి అభినందనలు

Nara Bhuvaneswari appreciates Bavaajna Sai as she got 3rd rank in 10th class
  • 10వ తరగతి పరీక్షల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ విద్యార్థిని మెరుగైన ప్రదర్శన
  • కృషి, పట్టుదల ఉంటే విజయం సొంతం అవుతుందన్న నారా భువనేశ్వరి
  • అందుకు ఈ అమ్మాయే నిదర్శనం అని కితాబు
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పలు విద్యాసంస్థలు కూడా నిర్వహిస్తున్నారు. విజయవాడ చల్లపల్లి వద్ద ఉన్న ఎన్టీఆర్ మోడల్ స్కూల్ విద్యార్థిని కె.భావజ్ఞ సాయి 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి వెల్లడించారు. 

"కె.భావజ్ఞ సాయికి అభినందనలు. కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సొంతం అవుతుందనడానికి ఈ విద్యార్ధినే నిదర్శనం. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను" అంటూ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.
Nara Bhuvaneswari
K Bhavaajna Sai
3rd Rank
10th Class
NTR Model School
Vijayawada
TDP
Andhra Pradesh

More Telugu News