Suhas: పారితోషికం మరీ అంత కాదులెండి: హీరో సుహాస్

Suhas Interview
  • వరుస హిట్స్ తో ఉన్న సుహాస్ 
  • మే 3న విడుదల కానున్న 'ప్రసన్న వదనం'
  • దర్శకులను నమ్ముతానన్న సుహాస్
  • కథ నచ్చితే ఇక ఆలోచన చేయనని వెల్లడి  

సుహాస్ .. ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు' సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ప్రసన్న వదనం'రెడీ అవుతోంది. మే 3వ తేదీన ఈ సినిమా విడుదల ఉండటంతో ప్రమోషన్స్ తో ఆయన బిజీగా ఉన్నాడు. 

తాజా ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ .. "ఒకసారి నేను కథ వినేసి ఓకే చెప్పిన తరువాత ఇంక నేను పట్టించుకోను. పూర్తిగా దర్శకుడిని నమ్మేసి ముందుకు వెళతాను. కొత్త దర్శకులు కదా అని నేను భయపడను. ఎందుకంటే తమని తాము నిరూపించుకోవాలని ఒక పట్టుదల .. అందుకు తగిన భయం వారికి ఉంటాయి, అందువలన దర్శకుల విషయంలో నాకు ఎటువంటి టెన్షన్ లేదు" అన్నాడు. 

" నేను 3 కోట్లకి పైగా పారితోషికం తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పారితోషికం ఎంతనేది నేను చెప్పనుగానీ, మొదట్లో నాకు ఇచ్చిన పారితోషికం కంటే ఇప్పుడు బాగానే ఉంది. నా పారితోషికం విషయంలో నేను సంతృప్తికరంగానే ఉన్నాను. 'ప్రసన్నవదనం' తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందని భావిస్తున్నాను" అని చెప్పాడు.
Suhas
Actor
Prasanna Vadanam

More Telugu News