Bonda Uma: వైసీపీ కండువాలు ఇప్పుడైనా తీసేయండి.. పోలీసులకు బోండా ఉమా హితవు

TDP Senior Leader Bonda Uma Press Meet In Vijayawada
  • జగన్ పై రాయి దాడి కేసులో తనను ఇరికించేందుకు సీపీ కుట్ర చేశారన్న ఉమా 
  • సీపీపై ఈసీ తీసుకున్న చర్యతోనైనా పోలీసులు మారాలని సూచన
విజయవాడ పోలీస్ కమిషనర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడాన్ని టీడీపీ నేత బోండా ఉమా స్వాగతించారు. వైసీపీ కండువా కప్పుకుని పనిచేస్తున్న పోలీసులకు ఇదొక హెచ్చరికగా భావించాలన్నారు. ఇది చూసిన తర్వాతైనా పోలీసు అధికారులు మారాలని, మెడలో వేసుకున్న వైసీపీ కండువాలు తొలగించి విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని పోలీసులను హెచ్చరించారు. ఈమేరకు బుధవారం విజయవాడలో బోండా ఉమా మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ డ్యూటీ చేసే పోలీసులు ఇప్పుడైనా మారాలని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాము వైసీపీ పరిధిలో కాకుండా ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్న విషయం గుర్తించాలని పోలీసులకు సూచించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. విజయవాడ సెంట్రల్ లో ఏసీపీ, సీఐలు వెలంపల్లి ఆదేశాలకు అనుగుణంగా డ్యూటీ చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు బోండా ఉమా తెలిపారు. సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తప్పించాలని ఈసీని కోరనున్నట్లు వివరించారు. అదేవిధంగా మే 1 న లబ్దిదారులకు వారి ఇంటి వద్దే పించన్ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.
Bonda Uma
TDP
Warning To Police
Vijayawada
ECI
AP Assembly Polls

More Telugu News