Vijayasai Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి‌పై ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు

Purandeswari believes that the people of AP do not deserve a manifesto says Vijayasai Reddy
  • జాతీయ మేనిఫెస్టోతోనే ఎన్నికల బరిలోకి దిగుతామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
  • రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక మేనిఫెస్టో అర్హత లేదని పురందేశ్వరి భావిస్తున్నారని విజయసాయి వ్యాఖ్య
  • ప్రజల పట్ల బీజేపీకి శ్రద్ధ లేదని విమర్శ 
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. పార్టీ జాతీయ మేనిఫెస్టోతో ఎన్నికల బరిలో దిగుతామని పురందేశ్వరి ప్రకటించడంపై ఆయన తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీకి ప్రత్యేక మేనిఫెస్టో అవసరం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయం.. ఆ పార్టీకి దార్శనికత లేకపోవడాన్ని ఎత్తిచూపుతోందని అన్నారు. ఏపీ ప్రజల పట్ల బీజేపీకి శ్రద్ధ లేదని రుజువైందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక మేనిఫెస్టో అర్హత లేదని పురందేశ్వరి భావిస్తున్నారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం నెగెటివ్ ప్రచారంతోనే ఓట్లు వచ్చేస్తాయని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vijayasai Reddy
Daggubati Purandeswari
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News