Amit Shah: ఎల్లుండి తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా

Amith Shah public meeting in siddipet on 25th
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గం.11.45 నిమిషాలకు సిద్దిపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక్కడ గంటపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం 2.15 గంటలకు బేగంపేట నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.
Go Back to Shorts
Amit Shah
Telangana
BJP
Lok Sabha Polls

More Telugu News