Nara Lokesh: కోవూరు లక్ష్మి వేలు నరుక్కోవడంపై నారా లోకేశ్ స్పందన

Nara Lokesh reacts on Kovuru Lakshmi cut her finger

  • జగన్ పాలనపై దిగ్భ్రాంతికర రీతిలో నిరసన తెలిపిన గుంటూరు జిల్లా మహిళ
  • ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏకలవ్య దీక్ష పేరిట బొటన వేలు నరుక్కున్న లక్ష్మి
  • నిరసన తెలిపేందుకు ఇలాంటివి వద్దని స్పష్టం చేసిన లోకేశ్

జగన్ పాలనను నిరసిస్తూ గుంటూరు జిల్లాకు చెందిన కోవూరు లక్ష్మి అనే మహిళ ఢిల్లీలో వేలు నరుక్కున్న ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 

వైసీపీ అవినీతి, అక్రమాలపై కోవూరు లక్ష్మి ఢిల్లీలోనూ పోరాడుతున్నారని తెలిపారు. సొంత బాబాయ్ ను చంపినవారు... మీరు వేలుకోసుకుంటే స్పందిస్తారా? అని కోవూరు లక్ష్మిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయినా, నిరసన తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, ఇలాంటివి వద్దు అని లోకేశ్ స్పష్టం చేశారు. 

గుంటూరు రూరల్ కు చెందిన కోవూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అనే సంస్థను నడిపిస్తున్నారు. వైసీపీ పాలనలో కళ్ల ముందే సమాజం ధ్వంసం అవుతుంటే చూస్తూ సహించలేక, ఇలా బొటన వేలు నరుక్కున్నట్టు కోవూరు లక్ష్మి ఓ వీడియోలో తెలిపారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఇది నా ఏకలవ్య దీక్ష అంటూ ఆమె తన బొటన వేలు నరుక్కోవడం తీవ్ర కలకలం రేపింది.

Nara Lokesh
Kovuru Lakshmi
TDP
New Delhi
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News