Maheshwar Reddy: అందుకే మీరు దేవుళ్ల మీద ప్రమాణం చేస్తున్నారు: సీఎంకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ

BJPLP Maheshwar Reddy open letter to CM Revanth Reddy
  • తన మాటలు ప్రజలు నమ్మడం లేదని రేవంత్ రెడ్డి తెలుసుకున్నారన్న ఏలేటి 
  • వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన
  • తులం బంగారం, లక్ష రూపాయల హామీ ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్న

తన మాటలను ప్రజలు నమ్మడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ప్రమాణం చేస్తున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తాను వివిధ అంశాలపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ పంపిస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కరవు కాటకాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కౌలు రైతులు సహా రాష్ట్ర రైతాంగానికి రూ.90వేల కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు.

రైతాంగానికి చేసే ఖర్చుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే పెళ్లి అయితే అమ్మాయికి తులం బంగారం, లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారని... ఈ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే తమతో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News