Pawan Kalyan: నా జీవితంలోంచి వెళ్లిపోయిన ఆడబిడ్డల గురించి మాట్లాడతావేం!: పవన్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలను కలిగివున్న జగన్ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 

"ఏం జగన్... నోరు ఎలా ఉంది? మీ అర్ధాంగి భారతి గారిని పెళ్లాం అంటే నచ్చుతుందా? జగన్ పెళ్లాం భారతి గారు అంటే నీకు కోపం రాదా? మా వ్యక్తిగత జీవితాల గురించి నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? నీకు బుద్ధుందా... ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వొక ముఖ్యమంత్రివేనా? అరే... ఎవరి వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉండవు? అందరి సంసారాలు బాగున్నాయా? కుటుంబాలు అన్నాక గొడవలు ఉండవా? 

భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే విడిపోతారు... నా జీవితంలోంచి వెళ్లిపోయిన ఆడబిడ్డల గురించి మాట్లాడుతూ ముగ్గురు పెళ్లాలు ముగ్గురు పెళ్లాలు అంటావు... మూర్ఖుడా...! దిగజారిపోయి మాట్లాడుతున్నావు... ఏం, ఒళ్లెలా ఉంది నీకు? భయపడతాం అనుకుంటున్నావా? జాగ్రత్తగా మాట్లాడు" అంటూ పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Pawan Kalyan
Bhimavaram
Varahi Vijayabheri
Jagan
Janasena
YSRCP

More Telugu News