Ilaiyaraaja: వారి కంటే ఇళయరాజా గొప్పవారేం కాదు.. తేల్చి చెప్పిన మద్రాస్ హైకోర్టు

Illaiyaraaja is not famous than others says Tamil Nadu high court

  • తన పాటలపై కాపీ హక్కులు కోరుతూ రికార్డింగ్ సంస్థలపై కోర్టుకెక్కిన ఇళయరాజా
  • ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పిన హైకోర్టు
  • కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా మరో పిటిషన్
  • ఇళయరాజా గొప్పవారన్న ఆయన తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించని న్యాయస్థానం

మ్యూజిక్ మాంత్రికుడు ఇళయరాజా అందరికంటే గొప్పవారనడానికి తాము అంగీకరించబోమని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా పేరుకెక్కిన ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజన్, శ్యామశాస్త్రి అందరికంటే గొప్పవారని.. వారికంటే ఇళయరాజా గొప్పవారనడాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది.

ఇంతకీ కేసేంటంటే.. తన పాటలను వాడుకునే ఒప్పందం గడువు పూర్తయిందని పేర్కొంటూ ఎకో రికార్డింగ్ తదితర సంస్థలపై కాపీ హక్కులు కోరుతూ ఇళయరాజా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ సంస్థలు రిట్‌ పిటిషన్ దాఖలుచేశాయి.

కేసును విచారించిన న్యాయస్థానం ఇళయరాజా పాటలను వాడుకొనే హక్కు ఆయా సంస్థలకు ఉందని పేర్కొంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా మరో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా ఇళయరాజా తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఇళయరాజా అందరికంటే గొప్పవారని పేర్కొన్నారు. దీనికి స్పందించిన న్యాయస్థానం ఈ వాదనను అంగీకరించబోమని, ఆయన అందరికంటే గొప్పవారు కాదని స్పష్టం చేస్తూ కేసును ఈ నెల 24కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News