నా భర్తపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: టెక్కలి వైసీపీ అభ్యర్థి భార్య
- టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి సంచలన ప్రకటన
- స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 22న నామినేషన్ వేస్తానని కార్యకర్తలతో అన్న వాణి
- శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్న దువ్వాడ శ్రీనివాస్
దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వాణిని టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జిగా వైసీపీ నియమించింది. అయితే, శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచీ ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ముఖ్యనాయకులు ఆమెను నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారని సమాచారం.