ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న ఆర్కే
- కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చలేదని ఆర్కే పిటిషన్
- సెలవుల తర్వాత విచారణ చేపట్టాలన్న టీఎస్ ప్రభుత్వ న్యాయవాది
- తదుపరి విచారణ జులై 24కి వాయిదా
ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు, రేవంత్ కుమ్మక్కయ్యారని అన్నారు. ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదా ఇచ్చే అవకాశం ఉండదని కోర్టు చెప్పిందని తెలిపారు. కేసు ముందుకు సాగకుండా ఏడేళ్ల నుంచి రకరకాల కారణాలతో సాగదీస్తున్నారని విమర్శించారు. ఇదే చివరి వాయిదా అని కోర్టు స్పష్టం చేసిందని... రాబోయే రోజుల్లో ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదని అన్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఈ కేసు ముందుకు సాగకపోవడానికి వ్యవస్థలను మేనేజ్ చేయడమే కారణమని చెప్పారు.