జపాన్ ను వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు.. వీడియో ఇదిగో!
- బుధవారం అర్ధరాత్రి ఘటన.. ఊగిపోయిన భవనాలు
- భయాందోళనలలో జపాన్ వాసులు
- వారం పాటు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వ సూచన
దీంతో పలుచోట్ల వాటర్ సప్లై పైపులు పగిలిపోయాయని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాసా హయాషి మీడియాకు వివరించారు. షికోకు ఎలక్ట్రిక్ పవర్ కు చెందిన ఇకాట న్యూక్లియర్ ప్లాంట్ పై భూకంప ప్రభావం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, భౌగోళిక పరిస్థితుల కారణంగా జపాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రతీ ఐదు భూకంపాలలో ఒకటి జపాన్ లోనే నమోదవుతుంది. జపాన్ చరిత్రలోనే అత్యంత తీవ్రతతో 2011 మార్చి 11న భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 9 పాయింట్లుగా నమోదైంది.