Lord Rama: భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్

  • స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎస్
  • రాములవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రులు భట్టివిక్రమార్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • ఒంటిమిట్టలో 22న సీతారాముల కల్యాణం
Sri Seetha Rama kalyanam in Bhadrachalam

భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరుగుతోంది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కల్యాణం చూసేందుకు ఎత్తున భక్తులు భారీగా తరలి వచ్చారు. కల్యాణ మహోత్సవంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం గం.12.30 వరకు స్వామివారి కల్యాణ క్రతువు ఉంటుంది. 

ఒంటిమిట్టలో 22న సీతారాముల కల్యాణం

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో కోదండరాముడి వార్షిక మహోత్సవాలు నేటి నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 22వ తేదీన రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాములవారి కల్యాణం లక్షమంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్టలో 23న రథోత్సవం నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

More Telugu News