Pushpa Pushpa: "పుష్ప పుష్ప"... రేపు పుష్ప-2 నుంచి తొలి సింగిల్ విడుదల

  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప: ది రూలర్
  • శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం
  • రేపు సాయంత్రం 5.04 గంటలకు తొలి పాట విడుదల
First single from Pushpa The Ruler will be out tomorrow

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప-2 నుంచి తొలి సింగిల్  విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు (మే 1) సాయంత్రం 5.04 గంటలకు పుష్ప-2 చిత్రం నుంచి పుష్ప పుష్ప అనే గీతం విడుదల చేయనున్నట్టు చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది. ఈ మేరకు పాటలో అల్లు అర్జున్ లుక్ ను కూడా పంచుకుంది. 

ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే. ఈ నేపథ్యంలో, రేపు విడుదలయ్యే లిరికల్ వీడియో కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

బన్నీ, సుక్కు కలయికలో వచ్చిన పుష్ప: ది రైజ్ చిత్రం ఎన్ని రికార్డులు తిరగరాసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప: ది రూలర్ పై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. ఇందులో కూడా రష్మిక మందనే కథానాయిక.

మైత్రీ మూవీస్ పతాకంపై వస్తున్న పుష్ప-2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

  • Loading...

More Telugu News