క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన బట్లర్.. అడుగు దూరంలోనే కోహ్లీ రికార్డు
- 7 సెంచరీలతో ఐపీఎల్లో అత్యధిక శతకాలు బాదిన రెండవ ఆటగాడిగా నిలిచిన బట్లర్
- 6 సెంచరీలతో 3వ స్థానానికి పడిపోయిన క్రిస్ గేల్
- 8 శతకాలతో టాప్ ప్లేస్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి చేరువయ్యేందుకు అడుగుదూరంలోనే బట్లర్
ఐపీఎల్లో అత్యధిక సెంచరీల వీరులు..
1. విరాట్ కోహ్లీ - 8 (244 మ్యాచ్‌లు)
2. జాస్ బట్లర్ - 7 (102 మ్యాచ్‌లు)
3. క్రిస్ గేల్ - 6 (142 మ్యాచ్‌లు)
4. కేఎల్ రాహుల్ - 4 (124 మ్యాచ్‌లు)
5. డేవిడ్ వార్నర్ - 4 (182 మ్యాచ్‌లు)
6. షేన్ వాట్సన్ - 4 (145 మ్యాచ్‌లు)
ఇక టీ20 ఫార్మాట్లో బట్లర్‌కు మొత్తం 8 సెంచరీలు ఉన్నాయి. సెంచరీలు అన్నీ తన జట్టు గెలిచిన మ్యాచ్‌ల్లోనే రావడం విశేషం.
టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీల వీరులు
1. క్రిస్ గేల్ - 22
2. బాబర్ ఆజం - 11
3. విరాట్ కోహ్లీ - 9
4. డేవిడ్ వార్నర్ - 8
5. మైఖేల్ క్లింగర్ - 8
6. ఆరోన్ ఫించ్ - 8
7. రోహిత్ శర్మ - 8
8. జాస్ బట్లర్ - 8.
కాగా గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బట్లర్ వీరోచిత శతకం సాధించాడు. 224 పరుగుల లక్ష్య ఛేదనలో 60 బంతుల్లో 107 పరుగులు బాదాడు. తొలుత 33 బంతుల్లో 42 పరుగులు రాబట్టిన బట్లర్ ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు. 22 బంతుల్లో 62 పరుగులు జోడించి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.