Road Accident: కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురి దుర్మరణం

Fatal accident near Kavali five dead
  • నెల్లూరు జిల్లాలో నెత్తురోడిన రహదారి
  • ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
  • కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి
  • మృతులు జలదంకి మండలం చామదల గ్రామ వాసులుగా గుర్తింపు 

నెల్లూరు జిల్లా కావలి వద్ద రహదారి నెత్తురోడింది. కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. రహదారిపై ఆగి ఉన్న ఓ లారీని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఘటన స్థలంలోనే మరణించారు. మృతులను కావలి డివిజన్ పరిధిలోని జలదంకి మండలం చామదల గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, రేపటి శ్రీరామ నవమి ఉత్సవ సామగ్రి కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News