rathod Bapurao: కాంగ్రెస్ పార్టీలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు

Rathod Bapurao joined the Congress in the presence of CM Revanth Reddy
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ జెండా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే
  • కాంగ్రెస్‌లో చేరిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, తదితరులు
  • కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏపూరి సోమన్న
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పలువురు నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులకు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాథోడ్ బాపూరావు 2014, 2018లలో బోథ్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2023లో తనకు బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో గత ఏడాది అక్టోబర్ నెలలో బీజేపీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు.

కాంగ్రెస్‌లో చేరిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క తదితరులు ఉన్నారు.

అంతకుముందు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజగోపాల్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
rathod Bapurao
Telangana
Congress
BRS

More Telugu News