Pawan Kalyan: చంద్రబాబు ఎస్టేట్ కు పవన్ కల్యాణ్ మార్కెటింగ్ మేనేజర్: ముద్రగడ సెటైర్లు

Mudragada describes Pawan Kalyan as marketing manager to Chandrababu
  • పవన్ కల్యాణ్ పై మరోసారి విమర్శలు చేసిన ముద్రగడ
  • చంద్రబాబు ఎస్టేట్ లో పవన్ పనిచేస్తున్నాడంటూ వ్యంగ్యం
  • కాపులను కొనేయడమే ఆయనకు అప్పగించిన పని అని వ్యాఖ్యలు 
జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఎస్టేట్ కు పవన్ కల్యాణ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడని, ఇప్పుడు మార్కెటింగ్ మేనేజర్ కూడా అయ్యాడని ముద్రగడ ఎద్దేవా చేశారు. కాపులను గుత్తగా కొనేయడమే ఈ మార్కెటింగ్ మేనేజర్ కు అప్పగించిన పని అని విమర్శించారు. ఆ ఉద్యమం తప్ప పేదలపై ప్రేమ లేదని... పేదల కోసం పనిచేద్దాం, పేదలకు సేవలు అందిద్దాం అనుకునే మనిషి కాదు అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పిఠాపురానికి ఎందుకు వస్తున్నాడో చెప్పాలని ముద్రగడ నిలదీశారు.
Pawan Kalyan
Mudragada Padmanabham
Chandrababu
YSRCP
Janasena
TDP

More Telugu News