తల్లితో గొడవపడుతున్న నానమ్మను పొడిచేసిన 14 ఏళ్ల బాలుడు.. జనగామ జిల్లాలో దారుణం
- పదేళ్ల క్రితం భర్తను కోల్పోయిన అత్తమామల వద్దే ఉంటున్న కోడలు
- అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు
- శనివారం రాత్రి మరోమారు గొడవ
- అది చూసి నానమ్మ చాతీలో కత్తితో పొడిచిన మనవడు
- పరారీలో ఉన్న బాలుడి కోసం పోలీసుల గాలింపు
ఇటీవల తరచూ అత్తమామలతో గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. ఇది చూసిన మనవడు (14) నానమ్మపై కోపంతో కత్తితో ఆమె చాతీలో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆమెను హనుమకొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న బాలుడి కోసం గాలిస్తున్నారు.