ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. భారత్ స్పందన ఇదీ
- ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు శాంతికి విఘాతం కలిగిస్తాయన్న భారత్
- సంయమనం పాటించాలని హితవు
- దౌత్యమార్గం ద్వారా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని సూచన
ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ఈ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలు భారతీయ సమాజంతో టచ్‌లో ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో ఆత్మరక్షణ కోసమే దాడులు ప్రారంభించినట్టు ఇరాన్ చెబుతోంది. మరోవైపు, ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను కూల్చివేయడంలో ఇజ్రాయెల్‌కు సాయం చేస్తున్నట్టు అమెరికా తెలిపింది.