BJP: బీజేపీతో పొత్తు కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేశారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Adi Srinivas alleges KTR trying to allign with bjp
  • బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేసినట్లు ఆ పార్టీ నేతలే చెప్పారని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ పాపాల పుట్ట మేడిగడ్డ రూపంలో పగిలిందన్న కాంగ్రెస్ నేత
  • తెలంగాణ ప్రజలు కరవుతో అల్లాడాలని మామ కేసీఆర్, అల్లుడు హరీశ్ రావు కోరుకుంటున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేశారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేసినట్లు ఆ పార్టీ నేతలే చెప్పారన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవినీతి చోటు చేసుకుందన్నారు. వారి పాపాల పుట్ట మేడిగడ్డ రూపంలో పగిలిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కరవుతో అల్లాడాలని మామ కేసీఆర్, అల్లుడు హరీశ్ రావు కోరుకుంటున్నారని మండిపడ్డారు.
BJP
Congress
BRS
KTR

More Telugu News