డియర్ వైసీపీ... ఇది మీ సీఎంకు కూడా వర్తిస్తుంది: పవన్ కల్యాణ్
- విజయవాడ ఎయిర్ పోర్టులో పేపర్ చూస్తున్న ఫొటో పంచుకున్న పవన్
- ఇది మోదీ హామీ... అవినీతిపరులు జైలుకే అంటూ ఆ పేపర్లో హెడ్డింగ్
- ఈ హెడ్ లైన్ నా దృష్టిని ఆకర్షించింది అంటూ పవన్ వ్యాఖ్యలు
దీనిపై పవన్ స్పందిస్తూ... "విజయవాడ ఎయిర్ పోర్టులో విమానం కోసం వేచిచూస్తుండగా ప్రత్యేకించి ఈ హెడ్ లైన్ నా దృష్టిని ఆకర్షించింది. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామంటూ గౌరవనీయ ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ప్రియమైన వైసీపీ... ఇది మీ సీఎంకు కూడా వర్తిస్తుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే... అది ఎన్నికలకు ముందు జరుగుతుందా, లేక ఎన్నికలు అయిపోయాక జరుగుతుందా? వైసీపీ సర్కారును సాగనంపి, బీజేపీ-టీడీపీ-జనసేనతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు" అంటూ పవన్ ట్వీట్ చేశారు.