కాంగ్రెస్ గెలిస్తే మతకల్లోలాలు, కర్ఫ్యులే ఉంటాయి: కిషన్ రెడ్డి హెచ్చరిక
- తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపణ
- తెలంగాణ నుంచి ఢిల్లీకి వందల కోట్ల రూపాయలు పంపిస్తున్నారని ధ్వజం
- కాంగ్రెస్ తెలంగాణలో తెచ్చిన మార్పు ఇదేనా? అని నిలదీత
- కేంద్రంలో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే మూడు నెలలకో ప్రధాని మారుతారని ఎద్దేవా
ఇండియా కూటమిలో ఐకమత్యం లేదన్నారు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే మూడు నెలలకు ఓ ప్రధానమంత్రి మారడం ఖాయమని ఎద్దేవా చేశారు. కలగూర గంపతో కూడిన పార్టీలు అధికారంలోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ భవిష్యత్తు దెబ్బతింటాయని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరోసారి మోదీ నాయకత్వంలో బీజేపీ గెలవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే మరోసారి కుటుంబ పాలన వస్తుందన్నారు.