Rohit Sharma: ఒకే కారులో వాంఖ‌డే స్టేడియానికి రోహిత్ శ‌ర్మ‌, ఆకాశ్ అంబానీ.. వీడియో వైర‌ల్‌!

MI owner Akash Ambani drives Rohit Sharma to Wankhede ahead of RCB clash
  • హిట్‌మ్యాన్‌ను త‌న ల‌గ్జ‌రీ కారులో రైడ్‌కి తీసుకెళ్లిన ఆకాశ్ అంబానీ
  • వాంఖ‌డే స్టేడియం బ‌య‌ట రోహిత్, ఆకాశ్ ఇలా ఒకే కారులో క‌నిపించిన వైనం
  • ఇవాళ రాత్రి ఆర్‌సీబీతో త‌ల‌ప‌డ‌నున్న ముంబై జ‌ట్టు
ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను ఆ ఫ్రాంచైజీ య‌జ‌మాని ఆకాశ్ అంబానీ త‌న కారులో రైడ్‌కి తీసుకెళ్లాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం బ‌య‌ట రోహిత్‌ను ఆకాశ్ త‌న ల‌గ్జ‌రీ కారులో ఎక్కించుకుని వెళ్తున్న వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఇక ఇవాళ రాత్రి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ముంబై జ‌ట్టు త‌ల‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో హిట్‌మ్యాన్‌ను ఆకాశ్ త‌న కారులో స్వ‌యంగా పిక్ చేసుకుని వెళ్లడంపై నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకంటే ప్ర‌స్తుతం ఎంఐకి హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా ఉన్నాడు. గ‌తేడాది వ‌ర‌కు ఈ జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మనే సార‌ధి. ఆయ‌న సార‌థ్యంలోనే ముంబై ఫ్రాంచైజీ ఐదుసార్లు టోర్నీ విజేత‌గా నిలిచింది. అయితే, ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ అనుకున్నంత స్థాయిలో ఆడ‌లేక‌పోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక‌టి మాత్ర‌మే గెలిచింది. దాంతో ముంబై ఫ్రాంచైజీ యాజ‌మాన్యం కంగారుప‌డుతోంది.

మ‌రోవైపు రోహిత్ ఫామ్ కూడా ఆ జ‌ట్టును క‌ల‌వ‌ర‌పెడుతోంది. హిట్‌మ్యాన్ నాలుగు మ్యాచుల్లో క‌లిపి కేవ‌లం 118 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. మ‌రోవైపు రోహిత్‌నే మ‌ళ్లీ కెప్టెన్ చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆకాశ్‌, రోహిత్ ఒకే కారులో వెళ్ల‌డం ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌కు దారితీసింది.
Rohit Sharma
Akash Ambani
Mumbai Indians
IPL 2024
Cricket
Sports News

More Telugu News